Attack On Ship In Red Sea | ఎర్ర సముద్రంలో రవాణా నౌకపై మరో దాడి.. 3 హౌతీ బోట్లను ముంచేసిన అమెరికా
Attack On Ship In Red Sea | ఎర్ర సముద్రంలో కంటైనర్ షిప్‌పై మరో దాడి జరిగింది. (Attack On Ship In Red Sea) సింగపూర్‌కు చెందిన డెన్మార్క్ యాజమాన్యంలోని మార్స్క్ హాంగ్జౌను ఇరాన్ మద్దతున్న యెమెన్‌లోని హుతీ తిరుగుబాటుదారులు మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు.
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో కంటైనర్ షిప్‌పై మరో దాడి జరిగింది. (Attack On Ship In Red Sea) సింగపూర్‌కు చెందిన డెన్మార్క్ యాజమాన్యంలోని మార్స్క్ హాంగ్జౌను ఇరాన్ మద్దతున్న యెమెన్‌లోని హుతీ తిరుగుబాటుదారులు మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఆ నౌక సిబ్బంది సహాయం కోరడంతో స్పందించినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది. యూఎస్ నేవీ హెలికాప్టర్లు కాల్పులు జరుపడంతో హుతీకి చెందిన మూడు చిన్న బోట్లు సముద్రంలో మునిగిపోయినట్లు చెప్పింది. మరో బోటులోని వారు పారిపోయినట్లు వెల్లడించింది.
కాగా, ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న ఈ రవాణా నౌక 24 గంటల్లో రెండవసారి దాడికి గురైనట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. తొలుత రెండు యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులతో ఈ నౌకను లక్ష్యంగా చేసుకోగా వాటిని పేల్చివేసినట్లు పేర్కొంది. అయితే ఒక క్షిపణి ఆ నౌకను తాకినట్లు వెల్లడించింది.
మరోవైపు ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ లక్ష్యంగా గాజాపై బాంబులు కురిపిస్తోంది. ఈ దాడుల్లో 20,000 మందికిపైగా పాలస్తీనా ప్రజలు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అండ ఉన్న యెమెన్‌లోని హుతీ తిరుగుబాటుదారులు గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా నిలిచారు. కీలకమైన ఎర్ర సముద్రంలో పశ్చిమ దేశాలకు చెందిన రవాణా నౌకలను టార్గెట్ చేసున్నారు. వాటిపై దాడులకు పాల్పడుతున్నారు.
Iranian-backed Houthi small boats attack merchant vessel and U.S. Navy helicopters in Southern Red Sea
On Dec. 31 at 6:30am (Sanaa time) the container ship MAERSK HANGZHOU issued a second distress call in less than 24 hours reporting being under attack by four Iranian-backed… pic.twitter.com/pj8NAzjbVF
— U.S. Central Command (@CENTCOM) December 31, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

