Pro Palestine Protests | అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తంగా మారిన పాలస్తీనా అనుకూల ఆందోళనలు
అమెరికాలోని యూనివర్సిటీల్లో పాలస్తీనాకు అనుకూలంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలను అడ్డుకునేందుకు వర్సిటీల్లోకి పోలీసులు ప్రవేశించడంతో పోలీసులు - విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి.
- అమెరికా యూనివర్సిటీల్లోకి ప్రవేశించిన పోలీసు బలగాలు
- వందలాది మంది విద్యార్థుల అరెస్టు
- పోలీసులు – విద్యార్థుల మధ్య ఘర్షణ
- కాలిఫోర్నియా వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత
Pro Palestine Protests | లాస్ ఏంజెల్స్, మే 2: అమెరికాలోని యూనివర్సిటీల్లో పాలస్తీనాకు అనుకూలంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలను అడ్డుకునేందుకు వర్సిటీల్లోకి పోలీసులు ప్రవేశించడంతో పోలీసులు – విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 17న కొలంబియా యూనివర్సిటీలో ఆందోళనలు ప్రారంభమై వివిధ విశ్వవిద్యాలయాలకు వ్యాపించిన సంగతి తెలిసిందే. గాజాలో తక్షణం కాల్పులు విరమించాలని, ఇజ్రాయెల్‌తో పాటు గాజాపై యుద్ధానికి మద్దతు ఇచ్చిన కంపెనీలతో యూనివర్సిటీలు సంబంధాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు విశ్వవిద్యాలయాల కేంద్రంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల నిరసనకారుల శిబిరంపై బుధవారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు ఇజ్రాయెల్ మద్దతుదారులు దాడి చేశారు. శిబిరం వద్ద బారికేడ్లను తొలగించి, పేప్పర్ స్ప్రేను వెదజల్లారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగి 15 మంది గాయపడ్డారు. తమపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదని, సకాలంలో స్పందించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
వందలాది మంది అరెస్టు
వర్సిటీలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసులు పిలుపునివ్వగా విద్యార్థులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున వందలాది సంఖ్యలో పోలీసు బలగాలు వర్సిటీ క్యాంపస్ లోపలికి ప్రవేశించి బారికేడ్లు, శిబిరాలను తొలగించే ప్రయత్నం చేయడంతో విద్యార్థులు ప్రతిఘటించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. టియర్ గ్యాస్‌ను, పేప్పర్ స్ప్రేను తట్టుకునేలా నిరసనకారులు సర్జికల్ మాస్క్‌లను, అద్దాలను ధరించారు. రబ్బర్ బుల్లెట్లను ఎదుర్కొనేందుకు ైప్లెవుడ్తో రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. హెల్మెట్లు ధరించారు. పోలీసులు స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. పలువురు విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకొని, నిరసన శిబిరాలను తొలగించారు. మరోవైపు పోర్ట్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, విస్కాన్సిన్ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీల్లోనూ పోలీసులు 90 మంది నిరసనకారులను అరెస్టు చేసి నిరసన శిబిరాలను తొలగించారు. కాగా, ఇప్పటివరకు అమెరికాలోని 30 యూనివర్సిటీలు, కళాశాలల్లో దాదాపు 1,600 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వియత్నాంపై యుద్ధానికి వ్యతిరేకంగా దశాబ్దాల క్రితం జరిగిన ఆందోళనల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో అమెరికాలోని యూనివర్సిటీల్లో ఆందోళనలు జరగడం ఇదే మొదటిసారి. ఆందోళనల కారణంగా ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు తాత్కాలికంగా మూతబడ్డాయి.
నిరసనలతో విధానాలు మార్చుకోం: బైడెన్
యూనివర్సిటీల్లో నిరసనలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం స్పందించారు. ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాలు అవసరమని, అయితే, ఇది శాంతిభద్రతలకు విఘాతం కలించేలా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. వర్సిటీల్లో నిరసనలు యుద్ధంపై, మధ్యప్రాచ్యంలో తమ విధానాలను మార్చుకునేలా, పునరాలోచించేలా ప్రేరేపించవని ఆయన స్పష్టం చేశారు.
స్థానిక చట్టాలను గౌరవించండి: విదేశాంగ శాఖ
అమెరికా యూనివర్సిటీల్లో ఆందోళనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇప్పటివరకు ఎంబసీని, కాన్సులేట్లను విద్యార్థులెవరూ సహాయం కోరలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. స్థానిక చట్టాలు, నిబంధనలను భారత పౌరులంతా గౌరవించాలని ఆయన కోరా రు. ప్రతి ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ, బాధ్యత, ప్రజాభద్రత, శాంతిభద్రతల మధ్య సమతుల్యత ఉండాలని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

