న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాలోని హిందూ కుష్ ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆందోళన చెందిన ఆయా నగరాల్లోని ప్రజలు ఇండ్లు, కార్యాలయాల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. నోయిడా, చండీగఢ్, లూథియానా, పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్ తదితర ప్రాంతాలలో రాత్రి 9.50 గంటలకు ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ఈ ప్రకంపనలు కొన్ని సెకండ్ల పాటు కొనసాగాయని, ఇంట్లోని వస్తువులు కదిలిపోయాయని హై రైజ్ భవనాల్లో నివసిస్తున్న వారు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించినట్టు సమాచారం రాలేదని అధికారులు తెలిపారు.