వాషింగ్టన్: ఇరాన్‌తో అణు చర్చల వేళ ఆ దేశాన్ని వెంటనే వీడాలని తమ పౌరులను అమెరికా హెచ్చరించింది. యూఎస్-ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న వారికి ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
అయితే ఈ ద్వంద్వ పౌరసత్వాన్ని తాము అంగీకరించబోమని, అలాంటి వారిని ఇరానియన్లుగానే పరిగణిస్తామని ఇరాన్ పేర్కొన్నది. మరోవైపు శుక్రవారం ఒమన్‌లో ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు ప్రారంభమయ్యాయి.