న్యూఢిల్లీ: ఉద్యోగ, వ్యాపార, ఇతర అవసరాల కోసం వివిధ దేశాల్లో నివసిస్తున్న అమెరికన్లలో తమ దేశ పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. అమెరికా పౌరసత్వం అనేది చాలా మందికి కల. అలాంటి పౌరసత్వాన్ని వీరు వదులుకుంటున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. 2024లో అమెరికా పౌరసత్వం వదులుకునే ఉద్దేశం ఉన్న అమెరికన్ల సంఖ్య 30 శాతం ఉండగా, అది 2025 నాటికి 49 శాతానికి పెరిగిందని ఒక సర్వే వెల్లడించింది.
గన్‌కల్చర్ పెరగడం, ఓటింగ్ హక్కులు కోల్పోవడం, క్యాపిటల్ భవనం అల్లర్లు వంటివి తాము పౌరసత్వం వదులుకోవడానికి ప్రధాన కారణాలుగా వారు పేర్కొంటున్నారు. పన్నుల విధానమే తమ నిర్ణయానికి ప్రధాన కారణమని 61 శాతం చెప్పగా, అక్కడి రాజకీయాల తీరే కారణమని 51 శాతం పేర్కొన్నారు. విచారణల సంఖ్య 300 శాతం పెరిగినట్టు కెనడా తెలిపింది.