వాషింగ్టన్, ఆగస్టు 29: మీకు నిద్రలో గురకవస్తుందా? అయితే, మధ్య వయసు దాటాక మీకు స్ట్రోక్, గుండెపోటు తప్పదని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికావ్యాప్తంగా 20-50 ఏండ్ల మధ్య వయసు గల 7,66,000 మందిపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.
గురకపెట్టే యువకులకు మధ్య వయసులో స్ట్రోక్ వచ్చే ముప్పు 60 శాతం ఉంటుందని తేల్చారు. గురక పెట్టనివాళ్లతో పోల్చితే గుండె సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు ఆమ్స్టర్డామ్లో నిర్వహించిన యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్లో సమర్పించారు.