వాషింగ్టన్ : గోడ వెనుక ఉండే వస్తువులను గుర్తించే కొత్త టెక్నాలజీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. వైఫై సిగ్నళ్ల ద్వారా ఈ టెక్నాలజీతో పక్కింటిపై నిఘా పెట్టవచ్చు. అమెరికాలోని సాంటా బార్బబా విద్యాసంస్థకు చెందిన ప్రొఫెసర్ యాసామిన్ మోస్టోఫి నేతృత్వంలో ఈ పరిశోధనలు నిర్వహించారు.
విఫ్రాక్ట్ అని పిలిచే ఈ టెక్నాలజీ జియోమెట్రికల్ థియరీ ఆఫ్ డిఫ్రాక్షన్ (జీటీడీ) ఆధారంగా రేడియో తరంగాల సాయంతో పని చేస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీతో కదిలే వస్తువులను మాత్రమే తెలుసుకునే వీలుంది. చలనం లేని వస్తువులను సైతం గుర్తించేలా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ మేరకు ఆంగ్ల వర్ణమాల సాయంతో పరిశోధనలు చేస్తున్నారు.