ఇస్లామాబాద్ : అంతర్జాతీయ, ప్రాంతీ య స్థాయిల్లో ఉగ్రవాద సంస్థలకు కళ్లెం వేయడంలో పాకిస్థాన్ పాత్రను అమెరికా ప్రశంసించింది. పాకిస్థాన్‌లో ఇటీవల ప్రాణ నష్టానికి కారణమైన ఉగ్రవాద దాడులను ఖండించింది. ఇస్లామాబాద్‌లో ‘పాకిస్థాన్-యూఎస్ కౌంటర్ టెర్రరిజం డయలాగ్’లో ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. అన్ని రూపాల్లోని ఉగ్రవాదంపై పోరాడతామని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి.