వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం చేయడానికి హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకొనే వారు ఇకపై తమ సామాజిక మాధ్యమాల ఖాతాలను బహిరంగపరచాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15 నుంచి అమలులోకి రానుంది. ఈ నిబంధనను ఇప్పటికే విద్యార్థులు, ఇతర పర్యాటకులకు అమలు చేస్తున్నారు.
తాజాగా హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు దరఖాస్తు చేసుకొనే వారికి కూడా వర్తింపజేయనున్నారు. చాలామంది తమ సోషల్ మీడియా ఖాతాలలో వ్యక్తిగత వివరాలను అందరికీ అందుబాటులో ఉంచకుండా ‘ప్రైవేట్’ అనే ఆప్షన్ను ఎంచుకుంటారు. ఆ ఆప్షన్ను ‘పబ్లిక్’గా మార్చాలని, తమ వ్యక్తిగత వివరాలను అందరికీ అందుబాటులో ఉంచాలని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.