Amazon | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.. ట్రంప్‌కు 1 మిలియన్ డాలర్లు అంటే రూ.8.3 కోట్లు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ (Amazon) వచ్చి చేరింది. ట్రంప్ ప్రమాణ స్వీకార నిధికి అమెజాన్ 1 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతేకాదు కంపెనీ తన ప్రైమ్ వీడియో సర్వీస్ (Prime Video service)లో కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయనున్నట్లు అమెజాన్ ప్రతినిధి గురువారం తెలిపారు. ఇందుకోసం అమెజాన్ మరో 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే వారం అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (Jeff Bezos).. ట్రంప్‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Nirmala Sitharaman | అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలా సీతారామన్.. వరుసగా ఆరోసారి చోటు
టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ట్రంప్