USCIRF | వాషింగ్టన్: భారత్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితుల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు మైనారిటీల అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డీ వరెన్నెస్ ఆరోపించారు. అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) చేపట్టిన విచారణలో ఈ వివరాలను వెల్లడించారు. భారత్లో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నదన్నారు.
ఈ సంస్థ గతంలో చేసిన ఇలాంటి ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇవన్నీ ప్రేరేపిత ఆరోపణలని కొట్టివేసింది. యూఎస్సీఐఆర్ఎఫ్ అమెరికా ప్రభుత్వ సలహా వ్యవస్థ.