Shehbaz Sharif | దాయాది పాక్ బుద్ధి కుక్క తోక వంకరలా ఉంది. ఆపరేషన్ సిందూర్‌తో దాయాదికి భారత్ గట్టి గుణపాఠం చెప్పినా పాక్ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. పదేపదే న్యూఢిల్లీతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇప్పటికే ఆదేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim Munir), మరో కీలక నేత బిలావల్ భుట్టో (Bilawal Bhutto) భారత్‌కు అణు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ ప్రధాని (Pak PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) కూడా వారితో చేరిపోయారు. సింధు జలాల (Indus Water) విషయంలో న్యూ ఢిల్లీకి కీలక హెచ్చరిక చేశారు.
పాకిస్థాన్‌కు చెందిన ఒక్క నీటి చుక్కను కూడా భారత్గుంజుకునేందుకు అవకాశం ఇవ్వబోమని హెచ్చరించారు. ‘మీరు మా నీటిని నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. మీరు అలాంటి చర్యకు ప్రయత్నిస్తే.. మీకు ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం నేర్పుతాం’ అని అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. సింధు జలాలు పాకిస్థాన్ జీవనాడి అని, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పాక్ హక్కుల విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు.
Also Read..
Asim Munir: ఆసిమ్ మునీర్.. ఓ సూట్ ధరించిన ఒసామా బిన్ లాడెన్
Bilawal Bhutto: నీళ్లు ఇవ్వకుంటే యుద్ధమే.. మళ్లీ వార్నింగ్ ఇచ్చిన బిలావల్ భుట్టో