వాషింగ్టన్: ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంపై ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. రెండు దశాబ్దాల పాటు ఆ దేశంలో తమ బలగాలను మోహరించి.. ఇప్పుడు వారిని వెనక్కి తీసుకెళ్లడంతో ఆఫ్ఘన్లో మరోసారి తాలిబన్లు చెలరేగిపోయి మొత్తం దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్న బలగాల ఉపసంహరణ కొనసాగుతుందని స్పష్టం చేసిన బైడెన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాలోని వైట్‌హౌజ్ ముందు కూడా ఆఫ్ఘన్ జాతీయులు బైడెన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మీరు మాకు నమ్మక ద్రోహం చేశారు. మీరే దీనికి బాధ్యులు అంటూ వాళ్లు నినాదాలు చేశారు.
తాలిబన్లు మా ప్రజలను చంపుతున్నారు. అక్కడ మహిళలకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. ప్రజలను చూసుకోవడానికి ఎవరూ లేరు అని నిరసనకారుల్లో ఒకరైన ఫర్జానా హఫీజ్ అన్నారు. దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత అక్కడి ప్రజల దీన స్థితి గురించి చెబుతూ మరో నిరసనకారుడు బోరున విలపించాడు. మరోవైపు ఆ దేశా మాజీ జర్నలిస్ట్ హమ్దర్ఫ్ గఫూరి స్పందిస్తూ.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ మేము 2000లోకి వెళ్లాము. మాకు శాంతి కావాలి. తాలిబన్ల చేతుల్లోకి వెళ్తే అక్కడ కొన్ని వేల మంది ఒసామా బిన్ లాడెన్లు, ముల్లా ఒమర్‌లు తయారవుతారు. వాళ్లు పాకిస్థాన్‌తో చేతులు కలిపి మధ్య ప్రాచ్యంపై దాడికి ప్రయత్నిస్తారు అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదివారం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను కూడా తాలిబన్లు ఆక్రమించిన విషయం తెలిసిందే. దీంతో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. తజకిస్థాన్‌కు పారిపోయారు. కాబూల్‌లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోసారి దేశంలో ఆటవిక రాజ్యం రానుండటంతో ఇప్పటికే వేల మంది ఆప్ఘన్లు దేశం వదిలి వెళ్లిపోవడానికి సరిహద్దుల దగ్గరికి భారీ చేరుకుంటున్నారు.
You're not the only one he betrayed.
— Sebastian Gorka DrG (@SebGorka) August 16, 2021
Afghan veterans outside the Biden White House. pic.twitter.com/vC1mxWdNZn
#WATCH | "Biden you betrayed us, Biden you are responsible," chanted Afghan nationals outside the White House against the US President after Afghanistan's capital Kabul fell to the Taliban pic.twitter.com/giMjt2grNW
— ANI (@ANI) August 16, 2021