Warren Buffett | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. వాణిజ్య యుద్ధానికి (Tariff War) తెరలేపిన విషయం తెలిసిందే. కెనడా (Canada), చైనా (China), మెక్సికో (Mexico) దేశాలపై భారీగా సుంకాలను విధించారు. పెంచిన సుంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (Warren Buffett) ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ప్రమాదకరమైందని పేర్కొన్నారు. ‘ఆ తర్వాత ఏంటి..? అనేది ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ అడగాల్సిన ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన అంశం. దాని గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అది చాలా కష్టమైన విషయం’ అని వారెన్ బఫెట్ అన్నారు.
కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా దిగుమతులపై 20 శాతం అదనపు సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెంచిన సుంకాలు నేటి నుంచే అంటే మార్చి 4 (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో కెనడా కూడా ప్రతి సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే 155 బిలియన్ డాలర్ల వస్తువులపై 25శాతం సుంకాలు వసూలుచేస్తామని వెల్లడించింది. ప్రతిగా చైనా సైతం అమెరికా దిగుమతులపై 10 నుంచి 15 శాతం సుంకాలు విధించింది. గత నెల 11 నుంచే వాటిని అమలు చేస్తున్నది.
Also Read..
Tariff War | చైనా ఉత్పత్తులపై మరో 10 శాతం సుంకాలు పెంచిన ట్రంప్
Donald Trump | రష్యాపై ఆంక్షలు ఎత్తివేసే దిశగా ట్రంప్ సర్కార్ అడుగులు
Donald Trump | ఉక్రెయిన్ ట్రంప్ షాక్.. సైనిక సాయం నిలిపివేసిన అమెరికా