హైదరాబాద్ : ప్రపంచంలోనే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైందో తెలుసా..? ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఇరాన్ వెళ్లాల్సిందే. ఇరాన్‌లోని అబదాన్లో జూన్ 21న 52.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని యూఎస్ స్టార్మ్ వాచ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా అబదాన్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. అబదాన్ సిటీలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం 70 ఏండ్లలో ఇదే తొలిసారి అని స్థానిక మీడియా పేర్కొన్నది.
ఖుజెస్థాన్‌లో ఎండలు దంచికొడుతుండటంతో.. ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కువైట్, ఇరాక్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఇరాక్‌లో దుమ్ము తుపానులు సంభవిస్తుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
Iran soared up to a scorching 52.2°C (126°F) today.
That’s the hottest temperature recorded on Earth this year and one of the highest “pre-solstice” temperatures ever recorded. pic.twitter.com/rlYTyTlvn7
— US StormWatch (@US_Stormwatch) June 20, 2022