ఓ మహిళ జిమ్ పరికరంపై తలకిందులుగా వర్కౌట్స్ చేస్తోంది. కొంతసేపటికి ఆమె కాళ్లు పరికరంలో ఇరుక్కుపోవడంతో ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. ఇంతలో ఆమెకు ఓ ఆలోచన తట్టింది. చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌ను వాడి బయటపడింది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది.
యూఎస్‌లోని ఒహియోకు చెందిన క్రిస్టీన్ ఫాల్డ్స్ తెల్లవారుజామున 3 గంటలకు జిమ్ లో వర్కౌట్స్ ప్రారంభించింది. శరీరాన్ని స్ట్రెచ్ చేసే ఇన్వర్షన్ టేబుల్‌పై అప్స్ అండ్ డౌన్ చేస్తోంది. వెన్నెముకను సాగదీయడంలో, వెన్నునొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అయితే, వ్యాయామం చేస్తున్నప్పుడు ఆమె చీలమండలు మెషీన్లో ఇరుక్కున్నాయి. దీంతో ఆమె ఎటూ కదల్లేకపోయింది. చుట్టూ ఎవరూ లేరు. ఆ సమయంలో చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్ నుంచి 911 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఒక అధికారి వచ్చి, ఆమెను రక్షించారు.
‘This is so embarrassing’ — A woman went viral after getting stuck upside down on an exercise machine and calling 911 for help 😅 pic.twitter.com/8nod8P6oQl
— NowThis (@nowthisnews) September 5, 2022