చైనాలోని ఆ సిటీలో రోజుకు 10 లక్షల కొత్త కేసులు.. న్యూఇయర్ నాటికి డబుల్ అయ్యే ప్రమాదం..!
Covid-19 | చైనాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. రోజూ కోటికిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాజధాని బీజింగ్
బీజింగ్: చైనాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. రోజూ కోటికిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాజధాని బీజింగ్ సహా ఏ నగరంలో, పట్టణంలో చూసినా భారీ సంఖ్యలో జనం కరోనా ఇన్ఫెక్షన్ బారినపడుతున్నారు. ఒక్కో నగరంలో లక్షల సంఖ్యలో కొత్తగా రోజువారీ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.
ఇక ముఖ్యంగా జెజియాంగ్ సిటీలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఆ నగరంలో ప్రస్తుతం రోజుకు ఇంచుమించుగా 10 లక్షల చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని జెజియాంగ్ ప్రావిన్స్ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. న్యూఇయర్ నాటికి అక్కడ రోజువారీ కేసుల సంఖ్య డబుల్ అయ్యే ప్రమాదం ఉన్నదని జెజియాంగ్ గవర్నమెంట్ ఆందోళన వ్యక్తంచేసింది.
కానీ, చైనా సర్కారు మాత్రం తమ దేశంలో కరోనా కంట్రోల్లోనే ఉన్నదని చెబుతున్నది. ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోయినా, శ్మశానాల్లోకి మృతదేహాలను తీసుకెళ్లిన వాహనాలు భారీ క్యూలైన్లలో నిలిచిపోయినా చైనా ప్రభుత్వం మాత్రం ఏమీ ఎరగనట్టు అంతా ప్రశాంతమేనని ప్రకటిస్తూ చేతులు కడిగేసుకుంటున్నది. బీజింగ్‌లో లాక్డౌన్ ఎత్తేసినప్పటి నుంచి రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్యను వెల్లడించడం కూడా మానేసింది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఆ దేశంలో పూర్తి భిన్నంగా ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- BF.7 Variant
- china
- Covid-19
- omicron
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

