న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో ఓ పెట్రోల్ ట్యాంకర్ (Fuel Tanker) పేలడంతో 77మంది మరణించారు. సెంట్రల్ నైజీరియాలోని నైజర్‌లో ఉన్న సులేజా ప్రాంతంలో కొంతమంది ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్‌లోకి జనరేటర్ ఉపయోగించి పెట్రోల్ పంపు చేస్తుండగా పేలుడు జరిగింది. దీంతో పెట్రోల్‌ను పంపు చేస్తున్నవారితోపాటు చుట్టుపక్కన పదుల మీటర్ల దూరంలో ఉన్నవారు కూడా మరణించినట్లు నైజీరియా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రమాదంలో మరో 25 మంది గాయపడ్డారని పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. మృతుల్లో చాలామంది గుర్తించలేనంతగా కాలిపోయారని తెలిపింది.
🚨🇳🇬FUEL TANKER EXPLODES IN NIGERIA, KILLING AT LEAST 60
A petrol tanker overturned in Niger state, spilling fuel that ignited in a massive explosion, killing at least 60 people and injuring many more.
Most victims were impoverished locals who rushed to scoop up the spilled… pic.twitter.com/X20zd7DxTB
— Mario Nawfal (@MarioNawfal) January 18, 2025
సరుకు రవాణాకు సరైన రైల్వే వ్యవస్థ లేకపోవడంతో నైజీరియాలో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. రెండు వారాల క్రితం డెల్టా స్టేట్‌లో ఫ్యూయల్ ట్యాంకర్ కోసం జరిగిన అల్లర్లలో ఐదుగురు మరణించారు. అదేవిధంగా గతేడాది అక్టోబర్‌లో పైప్లైన్ల నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకోవడానికి జనాలు ఎగబడటంతో జరిగిన పేలుళ్లలో సుమారు 153 మంది మృతిచెందారు. నైజీరియాలో ఆర్థిక పరిస్థితులు అంతకంతకూ దిగజారడంతో గత 18 నెలల్లో చమురు ధరలు 400 శాతం పెరిగాయి.
#Entérate en #VIDEO #ImagenesFuertes | TRAGEDIA EN NIGERIA
Al menos 70 personas murieron y varias más resultaron heridas, muchas de gravedad, luego de la explosión de un camión cisterna que se había volcado con más de 60 mil litros de combustible. Los residentes llegaron con… pic.twitter.com/id3Zuk002a
— CuartaPlana Oaxaca (@CuartaPlana) January 18, 2025