Earthquake | పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో 5.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి ఢాకాలో ఇప్పటి వరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గోడ కూలి ముగ్గురు, బిల్డింగ్ రూఫ్ కూలి ముగ్గురు మరణించినట్లు తెలిపింది.
#WATCH | A 5.5-magnitude earthquake struck near Narsingdi in Bangladesh, this morning.
Visuals from Dhaka as the agencies work to restore damages caused by the tremors. pic.twitter.com/rqHmCggN3L
— ANI (@ANI) November 21, 2025
ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరుస్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్డిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఈ భూకంపం బంగ్లాదేశ్-ఐర్లాండ్ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ప్రకంపనలతో కొన్ని నిమిషాల పాటూ మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత కొనసాగించారు.
మరోవైపు ఈ ప్రకంపనల ధాటికి భారత్‌లోనూ భూమి కంపించింది. కోల్‌కతా (Kolkata) సహా ఉత్తర భారతంలో (Northeast India) ప్రకంపనలు నమోదయ్యాయి. కోల్‌కతాలో ఉదయం 10:10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించింది. బెంగాల్‌లోని కూచ్‌బెహార్, దక్షిణ్, ఉత్తర దినాజ్‌పూర్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. గువాహటి, అగర్తల, షిల్లాంట్ వంటి నగరాల్లోనూ భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Strong tremors felt across parts of Kolkata, including the Salt Lake IT sector.
Employees evacuated buildings as precaution.
No major damage reported yet, but authorities urge people to stay alert and avoid using elevators.
Stay safe, Kolkata. 🌍⚠️#Earthquake #Kolkata #SaltLake pic.twitter.com/ZDQm6087wu— Dr Tapas Pramanick (R G Kar Medical College) (@Rgkar2019Tapas) November 21, 2025
Earthquake of 5.2 magnitude at Kolkata#Earthquake #Kolkata #Westbengal pic.twitter.com/QLNZCKETOx
— Dr Dilshad (Dentist) (@DilshadShakil) November 21, 2025
Also Read..
Air Pollution | తీవ్ర వాయు కాలుష్యం.. ఢిల్లీ స్కూల్స్‌లో అవుట్డోర్ గేమ్స్‌పై ప్రభుత్వం నిషేధం
NEET | కోచింగ్ స్టాఫ్ వేధింపులు.. నీట్ విద్యార్థి ఆత్మహత్య
ISS | రాత్రివేళల్లో ప్రకాశవంతంగా వెలుగులీనుతున్న ఢిల్లీ.. ఫొటోలు షేర్ చేసిన ఐఎస్ఎస్