Earthquake | తైవాన్ (Taiwan)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆగ్నేయ తీరప్రాంత కౌంటీ అయిన టైటుంగ్ (Taitung)లో బుధవారం భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. ఈ ప్రభావంతో రాజధాని తైపీ (Taipei)లో భవనాలు కుప్పకూలిపోయాయి. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (German Research Centre for Geosciences) ప్రకారం.. భూకంపం భూమికి 11.9 కిలోమీటర్ల లోతులో నమోదైంది. స్థానిక మీడియా సంస్థ తైవాన్ న్యూస్ ప్రకారం.. భూకంపం కేంద్రం టైటుంగ్ కౌంటీ హాల్‌కు ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Also Read..
BTech Student | అమ్మా.. ఓడిపోయాను.. డబ్బును వృధా చేయాలనుకోవడం లేదు : బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Girl Dies oF Dog Bite | కుక్క కరవడంతో చికిత్స పొందిన బాలిక.. నెల తర్వాత మృతి
Thackeray Cousins | 20 ఏళ్ల తర్వాత కలిసిన థాక్రే సోదరులు.. ముంబై స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ