అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి టెలికం దిగ్గజ కంపెనీలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ సంస్థలు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి.
అమెరికా నుంచి వెళ్లే లేదా అమెరికా రావసిన మొత్తం 538 విమానాలు 5జీ సేవలు ప్రారంభవడం కారణంగా రద్దు కానున్నాయని నివేదికలు వచ్చాయి. అయితే బుధవారం నాడు కేవలం 215 విమానాలు మాత్రమే రద్దయ్యాయి. వీటిలో ఎమిరేట్స్, ఎయిరిండియా, ఏఎన్ఏ, జపాన్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలున్నాయి.
అయితే యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నుంచి హామీ రావడంతో వీటిలో కొన్ని కంపెనీలు గురువారం నుంచి మళ్లీ తమ సేవలు పునఃప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 5జీ సర్వీసుల్లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ.. విమానాల్లోని రేడియో ఆల్టిమీటర్లలో కూడా ఉంటుంది.
దీంతో విమానాల ఆల్టిమీటర్లలో ఈ సేవలు జోక్యం చేసుకుంటాయని విమానయాన సంస్థలు భయం వ్యక్తం చేశాయి. దీంతో ఏటీ అండ్ టీ సంస్థ.. విమానాశ్రయాలు ఉన్న ప్రాంతాల్లో తమ సర్వీసులను వెనక్కు తీసుకుంది. అయితే మిగతా ప్రారంతాల్లో 5జీ సేవలు అందుబాటులోనే ఉన్నట్లు తెలుస్తోంది.