కొందామన్నా దొరుకట్లేదు.. మార్కెట్లో తగ్గిన విద్యుత్తు లభ్యత
రాష్ట్ర అవసరాలకు తగినంత విద్యుత్తు బహిరంగ మార్కెట్లో దొరుకడం లేదు. కొనుగోలు చేద్దామంటే తగినంత లభ్యతకావడంలేదు. 2 వేల మెగావాట్ల విద్యుత్తుకు ఇంధన ఎక్సేంజ్‌లో ఇండెంట్ పెడితే 500 మెగావాట్లలోపు మాత్రమే దొరుకుతున్నది. కొన్నిసార్లు కనీసం 400 మెగావాట్లు కూడా దొరుకడంలేదు. విద్యుత్తుకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని స్పష్టమవుతున్నది.
- పీక్ డిమాండ్‌లో భారీ హెచ్చుతగ్గులు
- గ్రిడ్ స్థిరత్వంపై ఇంజినీర్ల ఆందోళన
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర అవసరాలకు తగినంత విద్యుత్తు బహిరంగ మార్కెట్లో దొరుకడం లేదు. కొనుగోలు చేద్దామంటే తగినంత లభ్యతకావడంలేదు. 2 వేల మెగావాట్ల విద్యుత్తుకు ఇంధన ఎక్సేంజ్‌లో ఇండెంట్ పెడితే 500 మెగావాట్లలోపు మాత్రమే దొరుకుతున్నది. కొన్నిసార్లు కనీసం 400 మెగావాట్లు కూడా దొరుకడంలేదు. విద్యుత్తుకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని స్పష్టమవుతున్నది. ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.
దీంతో విద్యుత్తు వినియోగం, పీక్ డిమాండ్ అమాంతం పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు ఏ మాత్రం సరిపోవడంలేదు. ప్రస్తుతం రోజువారీగా జెన్కో ప్లాంట్ల నుంచి 100, సింగరేణి ప్లాంట్ల నుంచి 25 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే అందుతున్నది. కానీ, రాష్ట్రంలో రోజువారీగా 270 నుంచి 315 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతున్నది. ఇందులో 100-110 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సీజీఎస్ అండ్ పర్చేజెస్ ద్వారా కొంటున్నారు. కొన్నిసార్లు ఏకంగా 136 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి.
పీక్ డిమాండ్‌లో హెచ్చుతగ్గులు
విద్యుత్తు పీక్ డిమాండ్‌లో హెచ్చుతగ్గులు ఇంజినీర్లను కలవరపెడుతున్నాయి. ఈ నెల 10న రికార్డు స్థాయిలో ఏకంగా 19,467 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదయ్యింది. ఆ తర్వాత 13న ఈ డిమాండ్ 13,984 మెగావాట్లకు పడిపోయింది. తద్వారా కేవలం 24 గంటల వ్యవధిలోనే 6 వేల మెగావాట్లు తగ్గింది. ఆ తర్వాత నుంచి క్రమంగా పెరుగుతున్న పీక్ డిమాండ్ మళ్లీ మూడు రోజులకే 18,103 మెగావాట్లకు చేరింది. తాజాగా ఆదివారం 16,497 మెగావాట్లకు తగ్గింది. ఈ హెచ్చుతగ్గులు గ్రిడ్ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ తరుణంలో అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని విద్యుత్తు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

