Russia – Ukraine | రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నివారణ దిశగా పురోగతి సాధించామని ఉక్రెయిన్ ప్రతినిధి చెప్పారు. రెండు దేశాల అధ్యక్షుల మధ్య శాంతి చర్చలకు అవసరమైన వాతావరణం మార్గం సుగమమైందన్నారు. ఉక్రెయిన్ భద్రతకు అంతర్జాతీయంగా హామీ ( international guarantees ) కావాలని ఉక్రెయిన్ ప్రతినిధులు ప్రతిపాదించారు. దీంతో టర్కీలోని ఇస్తాంబుల్‌లో మంగళవారం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లయింది. తదనుగుణంగా కీవ్‌తోపాటు చెర్నీహివ్ నగరాలు ఇతర ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరిస్తామని రష్యా ప్రకటించింది.
దేశ రాజధాని ఉక్రెయిన్ సబర్బన్ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉక్రెయిన్ సేనలు.. మరియాపోల్‌పై నియంత్రణ కోసం పోరాడుతున్నాయి. రాజధానికి వాయవ్య ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం రష్యా సైన్యానికి గట్టి ఎదురుదెబ్బేనని ఉక్రెయిన్ అంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి డెనీస్ మొనాస్టైర్‌స్కై చెప్పారు.
ఇర్పిన్పై పట్టు కోల్పోవడం రష్యాకు ఎదురు దెబ్బేనని పశ్చిమ దేశాల నిపుణులు అంటున్నారు. అయితే, తిరిగి పట్టు సాధించేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. భద్రతపై హామీ కోసం ఉక్రెయిన్ తమకు తటస్థ హోదా కల్పించాలని ప్రతిపాదిస్తున్నది. అలాగని తాము నాటో కూటమిలో చేరబోమని చెబుతున్నది.
నాటో కూటమి ఆర్టికల్5కు అనుగుణంగా పోలండ్, ఇజ్రాయెల్, టర్కీ, కెనడా, చైనా నుంచి అంతర్జాతీయ స్థాయిలో భద్రతకు హామీ కావాలని ఉక్రెయిన్ ప్రతిపాదిస్తున్నది. ఈ దేశాల హామీతో అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకోవాలని చెబుతున్నది.