లండన్, డిసెంబర్ 4: భూమిపైకి ఒక చిన్న గ్రహశకలం దూసుకొచ్చింది. మంగళవారం ఈశాన్య సెర్బియాపైన ఇది భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. కేవలం 27 ఇంచుల సైజులో, 70 సెంటీమీటర్ల వ్యాసంతో ఉన్న ఈ గ్రహశకలానికి కొవెప్సీ5గా నామకరణం చేశారు. గ్రహశకలం భూమి మీదకు రావడానికి 12 గంటల ముందే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెచ్చరిక జారీ చేసింది.
అయితే, చిన్న సైజులో ఈ గ్రహశకలం ఉన్నందున ఎలాంటి ముప్పు ఉండబోదని చెప్పింది. ఊహించినట్టుగానే భూమి వాతావరణంలోకి చేరగానే ఈ గ్రహశకలం కాలిపోయింది. యాకుత్స్, ఒలెక్మిన్స్ ప్రాంతాల ప్రజలకు ఆకాశంలో వెలుగుతూ కనిపించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.