Journalists Killed | హమాస్ (Hamas) అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా (Gaza) నగరంపై ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులు చేస్తోంది. తాజాగా ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఆల్ జజీరా (Al Jazeera)కు చెందిన ఐదుగురు జర్నలిస్ట్‌లు (Journalists) ప్రాణాలు కోల్పోయారు. అల్-షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆస్పత్రి బయట ఉన్న ప్రెస్ టెంట్ ధ్వంసమైంది. అందులో ఉన్న ఐదుగురు జర్నిలస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది.
ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. అందులో ఐదుగురు తమ పాత్రికేయులేనని అల్ జజీరా మీడియా సంస్థ పేర్కొంది. అల్ జజీరా కరస్పాండెంట్స్ అనాస్ అల్ షరీఫ్, మహమ్మద్ ఖ్రీకె, కెమెరామెన్లు ఇబ్రహీం జహీర్, మోమెన్ అలివా, మహ్మద్ నౌఫల్ మరణించినట్లు సంస్థ తెలిపింది. అయితే, అనాస్ అల్ షరీఫ్ ఓ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ ఆరోపించింది. అతడు హమాస్ టెర్రరిస్ట్ (Hamas Terrorist) సెల్‌కు హెడ్‌గా పనిచేసినట్లు ఆరోపించింది. జర్నలిస్టు ముసుగులో ఉన్న టెర్రరిస్ట్ షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
కాగా, ఈ దాడికి కొన్ని నిమిషాల ముందు అనాస్ అల్ షరీప్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. గాజా నగరంలో ఇజ్రాయెల్ బాంబు దాడులను తీవ్రతరం చేసిందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పెట్టిన కాసేపటికే ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో అతడు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
Also Read..
Turkey Earthquake | టర్కీలో భూకంపం.. 16 భవనాలు నేలమట్టం.. వీడియోలు
Pak | భారతీయ విమానాలకు ఎయిర్‌స్పేస్ మూసివేత.. పాక్‌కు రెండునెలల్లో రూ.1240 కోట్లు లాస్..!