Pak | భారతీయ విమానాలకు ఎయిర్‌స్పేస్ మూసివేత.. పాక్‌కు రెండునెలల్లో రూ.1240 కోట్లు లాస్..!
Pak | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కు భారత్ తీసుకున్న చర్యలతో మరోసారి ఆర్థికంగా తీవ్రంగానే నష్టపోతున్నది. అప్పుల ఊభిలో కూరుకుపోయిన పాకిస్తాన్.. చేసిన తప్పులకు ప్రస్తుతం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. భారత విమానాలకు గగనతలాన్ని నిషేధించిన విషయం తెలిసిందే.
Pak | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కు భారత్ తీసుకున్న చర్యలతో మరోసారి ఆర్థికంగా తీవ్రంగానే నష్టపోతున్నది. అప్పుల ఊభిలో కూరుకుపోయిన పాకిస్తాన్.. చేసిన తప్పులకు ప్రస్తుతం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. భారత విమానాలకు గగనతలాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ రెండునెలల్లోనే ఏకంగా రూ.1240 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎయిర్ స్పేస్‌ను మూసివేయడం వల్ల ఫలితంగా ట్రాఫిక్ 20శాతం తగ్గిందని రక్షణ మంత్రిత్వశాఖ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయగా.. పాకిస్తాన్ భారతీయ విమానాలకు ఎయిర్ స్పేస్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నిషేధం కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ తాను చేసిన చిన్న తప్పు కారణంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. రెండునెల్లలోనే రూ.1240 కోట్లు నష్టపోగా.. ఎయిర్‌స్పేస్ బ్యాన్ కారణంగా 20శాతం ట్రాఫిక్ తగ్గిందని రక్షణ మంత్రిత్వశాఖ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి తెలిపింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 30 మధ్య ఎయిర్‌స్పేస్ నిలిపివేత కారణంగా పాకిస్తాన్ విమానాశ్రయ అథారిటీ (PAA) విమాన ఛార్జీల ఆదాయం పడిపోయింది. ప్రతిరోజూ దాదాపు 100-150 భారతీయ విమానాలు ప్రభావితమయ్యాయి. పాకిస్తాన్ రవాణా విమాన ట్రాఫిక్ దాదాపు 20 శాతం తగ్గింది. పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ నష్టాలను అంగీకరించింది. సార్వభౌమాధికారం, జాతీయ రక్షణ ఆర్థిక అంశాలకు అతీతమంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

