పాక్‌లో పేలిన కారు బాంబు.. చైనా రాయబారే లక్ష్యం
కారు బాంబు| పాకిస్థాన్‌లో చైనా రాయబారి పర్యటిస్తున్నారు. ఆయనకు క్వెట్టాలోని ఓ హోటల్లో ఆతిథ్యం కల్పించారు. హోటల్ బయట నిన్న రాత్రి ఓ కారు బాంబు పేలింది.

క్వెట్టా: చైనా రాయబారి తన బృందంతో పాకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఆయనకు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రాజధాని క్వెట్టాలోని ఓ పేరుమోసిన హోటల్లో ఆతిథ్యం కల్పించారు. అయితే వారు బసచేస్తున్న హోటల్ బయట నిన్న రాత్రి ఓ కారు బాంబు పేలింది. దీంతో నలుగురు మృతిచెందగా, డజన్లకొద్ది గాయపడ్డారు. చైనీస్ అంబాసిడర్ ఉన్న సెరెనా హోటల్ వద్ద పార్క్ చేసిన ఓ కారులో పేలుళ్లు సంభవించాయి. అయితే ఆ సమయంలో చైనా రాయబారి ఆ హోటల్లో లేరని పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్ చెప్పారు. ఈ పేలుళ్లలో నలుగురు చనిపోగా, 12 మంది గాయపడ్డారని తెలిపారు.
కాగా, ఈ పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఏ గ్రూపూ బాధ్యతవహిస్తున్నట్లు ప్రకటించలేదని పోలీసులు తెలిపారు. ఓ కారులో ఉంచిన ఐఈడీని పేల్చినట్లు నిర్ధారించారు. గతంలో కూడా బలూచిస్తాన్‌లో ఇలాంటి పేలుళ్లు సంభవించాయి. గతేడాది జూన్‌లో చైనీస్ కంపెనీ పెట్టుబడులు పెట్టిన పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లక్ష్యంగా బాంబుదాడి జరిగింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్టీ ఈ దాడికి పాల్పడింది. ఇప్పుడుకూడా అదే సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నెగెటివ్ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్కే
మీ ఇంటిని చేస్తాం.. ఐసీయూ..
రెమ్‌డెసివిర్ ఎక్కడ దొరుకుతుంది?
ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.750!
ఇప్పుడు మాత్రం నెహ్రూపై నింద వేయలేరు
దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్
దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్
కొవాగ్జిన్.. రామబాణం
జలాంతర్గామి మాయం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

