Earthquake | చైనా (China)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. షింజియాంగ్ (Xinjiang)లో మంగళవారం భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. అయితే, ఈ విపత్తులో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
కాగా, గత వారం సిచువాన్ (Sichuan) ప్రావిన్స్‌లోని జిన్‌లాంగ్ కౌంటీలో భూమి కంపించిన విషయం తెలిసిందే. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.4గా నమోదైనట్లు చైనా భూకంప కేంద్రం తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి పొరుగున ఉన్న భూటాన్ (Bhutan)లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అక్కడ భూకంపం తీవ్రత 3.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ధాటికి ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
Also Read..
Pumpkin | కూష్మాండం @ 1,064 కిలోలు.. విజేతగా నిలిచిన ఇంజినీర్
Shehbaz Sharif | ట్రంప్‌పై పాక్ ప్రధాని ప్రశంసలు.. ఇటలీ ప్రధాని మెలోనీ రియాక్షన్ చూశారా..? VIDEO
Donald Trump | మీరు చాలా అందంగా ఉన్నారు.. మెలోనీపై ట్రంప్ పొగడ్తల వర్షం