దవాఖాన నిర్లక్ష్యం.. పాక్లో331 మంది పిల్లలకు హెచ్ఐవీ!
పాకిస్థాన్లోని తౌన్సా నగరంలో ఓ ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 331 మంది పిల్లలకు హెచ్ఐవీ సోకిందని బీబీసీ దర్యాప్తులో తేలింది.
- బీబీసీ కథనం.. ఖండించిన పాక్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని తౌన్సా నగరంలో ఓ ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 331 మంది పిల్లలకు హెచ్ఐవీ సోకిందని బీబీసీ దర్యాప్తులో తేలింది. నవంబర్ 2024-అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టు తెలిపింది. సురక్షితం కాని సూదులు వాడటం, సిరంజీలు, వయల్స్ వాడినవే వాడటం వల్ల హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందినట్టు వెల్లడించింది.
ఒకే వయల్లోని మందును పలువురు చిన్నారులకు ఎక్కించారని వివరించింది. సిరంజీని మార్చకుండా వాడినప్పుడు హెచ్ఐవీ సంక్రమించే అవకాశం ఉందని.. ఇది ప్రమాదకరమని నిపుణులు తెలిపారు. ఇంజెక్షన్లను వేడి నీళ్లలో శుభ్రపరచకుండా వాడినట్టు దర్యాప్తులో తేలింది.
8 ఏండ్ల మొహమ్మద్ అమిన్ అనే పిల్లాడు చనిపోవడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే దవాఖాన అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. బీబీసీ ఫుటేజీ పాతది లేదా బూటకమైనది కావొచ్చన్నారు. తాము సరైన నియమావళిని పాటిస్తున్నామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

