Nepal | హిమాలయ దేశం (Himalayan country) నేపాల్ (Nepal)లో ఘర్షణ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాపై విధించిన నిషేధం హింసకు దారి తీసింది. నేపాల్ ప్రభుత్వం ఇటీవలే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, స్నాప్‌చాట్ తదితర 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా వేలాదిమంది యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
#WATCH | Nepal | Protest turned violent in Kathmandu as people staged a massive protest outside Kathmandu Parliament against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites, leading to clashes between police and protesters. pic.twitter.com/XsGv1u6UFY
— ANI (@ANI) September 8, 2025
ఖాట్మాండూలోని నేపాల్ (Nepal) పార్లమెంట్ వైపుకు నిరసనకారులు దూసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో భద్రతా దళాలు రబ్బర్ బుల్లెట్స్‌తో కాల్పులు జరిపారు. అంతేకాదు, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ (Water Cannons) ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు.
#WATCH | Nepal | Protest turned violent in Kathmandu as people staged a massive protest outside Kathmandu Parliament against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites, leading to clashes between police and protesters. pic.twitter.com/jifSQlHFqC
— ANI (@ANI) September 8, 2025
పరిస్థితిని ముందే అంచనా వేసిన అధికారులు సోమవారం న్యూ బనేశ్వర్, చుట్టుపక్కల ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు. నిరసనలో పాల్గొన్న వేలాది మంది యువకులు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులు నిషేధిత ప్రాంతంలోకి చొరబడటంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 10 గంటల వరకు నగరంలో కర్ఫ్యూ విధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
#WATCH | Nepal | Protest turned violent in Kathmandu as people staged a massive protest outside Kathmandu Parliament against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites, leading to clashes between police and protesters. pic.twitter.com/61D5wK3ZTB
— ANI (@ANI) September 8, 2025
#WATCH | Nepal | Protestors vandalise the Parliament gate as the protest turned violent in Kathmandu, as people staged a massive protest against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites, leading to clashes between police and protesters pic.twitter.com/dkh9Mg7BGc
— ANI (@ANI) September 8, 2025
Also Read..
Elon Musk | ఎక్స్ ఫ్యాక్ట్‌చెక్‌ను తప్పుబట్టిన నవారో.. గట్టిగా బదులిచ్చిన ఎలాన్ మస్క్
Zelensky | భారత్‌పై ఆంక్షలు సరైన నిర్ణయమే : జెలెన్స్కీ
Donald Trump | రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై రెండో దశ ఆంక్షలకు సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన