Elon Musk | రష్యా ఆయిల్ కొనుగోలు కారణం చూపి భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా సుంకాలు, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్ టారిఫ్‌లపై సొంత దేశంలోనే విమర్శలు వస్తున్నాయి. అయితే, కొందరు మాత్రం భారత్‌పై ఆంక్షలను సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ సన్నిహితుడు, సీనియర్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో (Peter Navarro) గత కొన్ని రోజులుగా భారత్‌పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆయన చేసిన విమర్శలు హాట్ టాపిక్‌గా మారాయి. రష్యా నుంచి చౌకగా ముడి చమురును కొనుగోలు చేస్తూ భారత్ లాభాలను ఆర్జిస్తోందని.. ఆయిల్ కొనుగోలుతో వచ్చిన డబ్బుతో రష్యా యుద్ధ యంత్రాన్ని నడిపిస్తుందని పీటర్ నవారో ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. అయితే, ఆయన ఆరోపణలన్నీ అబద్ధమని ‘ఎక్స్’ ‘ఫ్యాక్ట్ చెక్’ (X fact check) తేల్చింది. రష్యన్ చమురు కొనుగోలు చేయడం పూర్తిగా చట్టబద్ధమైందని పేర్కొంది. ఎక్స్ ఫ్యాక్ట్చెక్పై నవారా స్పందించారు. అది తప్పుదారి పట్టించేది అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా స్పందించారు. ఎవరు తప్పు చేసినా ఎక్స్ కమ్యూనిటీ నోట్స్ సరిచేస్తుందని తెలిపారు. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా గ్రోక్ మరింత వాస్తవ తనిఖీలను వినియోగదారులకు అందిస్తుందని చెప్పారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
రష్యా నుంచి చౌకగా ముడి చమురును కొనుగోలు చేస్తూ భారత్ లాభాలను ఆర్జిస్తోందని.. ఆయిల్ కొనుగోలుతో వచ్చిన డబ్బుతో రష్యా యుద్ధ యంత్రాన్ని నడిపిస్తుందని పీటర్ నవారో ఆరోపించారు. ‘భారత్ అధిక సుంకాలు అమెరికన్ ఉద్యోగాలను చంపుతోందని.. భారత్ లాభం కోసమే రష్యన్ చమురును కొనుగోలు చేస్తుంది. ఈ ఆదాయం రష్యాకు యుద్ధంలో బలాన్ని ఇస్తుంది. ఉక్రేనియన్లు, రష్యన్లు చనిపోతున్నారు. అమెరికన్ పన్ను చెల్లింపుదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. భారతదేశం సత్యాన్ని తట్టుకోలేక అబద్ధాలను వ్యాప్తి చేస్తోంది. భారతదేశం యొక్క అధిక దిగుమతి సుంకం (సుంకం) కారణంగా అమెరికన్ పరిశ్రమ భారీ నష్టాలను చవిచూస్తోంది’ అని నవారో ఆరోపించారు.
నవారా పోస్ట్‌పై ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేపట్టింది. రష్యన్ చమురు కొనుగోలు చేయడం పూర్తిగా చట్టబద్ధమైందని.. దాని ఇంధన భద్రత కోసమే అని తేల్చింది. ‘భారతదేశం రష్యన్ చమురు దిగుమతులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించవు’ అని పేర్కొంది. ‘భారతదేశం కొన్ని ఉత్పత్తులపై సుంకాలు ఉన్నప్పటికీ, భారతదేశంతో సేవల్లో అమెరికాకు వాణిజ్య మిగులు ఉంది. అమెరికా ఇప్పటికీ రష్యా నుంచి యురేనియం వంటి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితిలో భారత్‌ను విమర్శించడం ద్వంద్వ ప్రమాణాలను చూపుతుంది’ అని పేర్కొంది.
ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ నవారాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ను సైతం నవారా టార్గెట్ చేశారు. ఎక్స్ ఫ్యాక్ట్‌చెక్ ‘తప్పుదారి పట్టించేది’ అని పేర్కొన్నారు. ‘వావ్..! ఎలాన్ మస్క్ ప్రజల పోస్ట్లలోకి ప్రచారాన్ని అనుమతిస్తున్నారు. ఫ్యాక్ట్‌చెక్ అర్థం లేనిది. భారతదేశం లాభాపేక్ష కోసం మాత్రమే రష్యన్ చమురును కొనుగోలు చేస్తోంది. యుద్ధానికి ముందు భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయలేదు. ఉక్రేనియన్లను చంపడం ఆపండి. అమెరికన్ ఉద్యోగాలను తొలగించడం ఆపండి’ అంటూ స్పందించారు.
Also Read..
Zelensky | భారత్‌పై ఆంక్షలు సరైన నిర్ణయమే : జెలెన్స్కీ
Donald Trump | రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై రెండో దశ ఆంక్షలకు సిద్ధం.. ట్రంప్ కీలక ప్రకటన