Gaza | గత 21 నెలలుగా హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్ (Gaza)పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులతో (Israeli airstrikes) విరుచుకుపడుతోంది. తాజాగా గాజాలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 28 మంది పాలస్తీనియన్లు (Palestinians) మరణించినట్లు గాజా ఆసుపత్రి వర్గాలు శనివారం తెలిపాయి. వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి గాజాలోని దేయిర్ అల్-బాలా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది, గాజాలోని ఖాన్ యూనస్‌లో జరిపిన దాడుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు గత 48 గంటల్లో గాజా స్ట్రిప్‌లోని దాదాపు 250 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వాటిలో ఉగ్రవాద స్థావరాలు, ఆయుధ నిల్వ కర్మాగారాలు, క్షిపణి ప్రయోగ పోస్టులు, స్నిపర్ పోస్టులు, సొరంగాలు, హమాస్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 2023లో ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంలో ఇప్పటివరకు 58 వేలకుపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో పెద్ద సంఖ్యలో జనాభా నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు.
Also Read..
Tesla | ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ.. కీలక ప్రకటన చేసిన టెస్లా
Shubhanshu Shukla | జులై 15న భూమికి చేరుకోనున్న శుభాన్షు శుక్లా.. వారం రోజులపాటూ క్వారంటైన్
IIM Calcutta | కోల్‌కతాలో మరో దారుణం.. బాయ్స్ హాస్టల్లో విద్యార్థినిపై అత్యాచారం