Uganda School | ఉగాండాలో దారుణం.. పాఠశాలపై తిరుగుబాటుదారుల దాడిలో 25 మంది మృతి
Uganda School | ఆఫ్రికా దేశం (Africa Country) ఉగాండా (Uganda)లో దారుణం చోటు చేసుకుంది. అలైడ్ డెమొక్రటిక్ ఫోర్స్ (ఏడీఎఫ్)కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు.. పశ్చిమ ఉగాండాలో మారణహోమం సృష్టించారు.
Uganda School | ఆఫ్రికా దేశం (Africa Country) ఉగాండా (Uganda)లో దారుణం చోటు చేసుకుంది. అలైడ్ డెమొక్రటిక్ ఫోర్స్ (ఏడీఎఫ్)కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు.. పశ్చిమ ఉగాండాలో మారణహోమం సృష్టించారు. కాంగో సరిహద్దు సమీపంలోని ఎంపాండ్వే (Mpondwe) పట్టణంలోని ఓ పాఠశాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
‘ఏడీఎఫ్ (ADF)కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు లుబిరిరా సెకండరీ పాఠశాల (Lhubirira secondary school)పై దాడులు జరిపారు. పాఠశాలకు చెందిన డార్మిటరీని కాల్చేశారు. ఫుడ్ స్టోర్ ను కూడా దోచుకున్నారు. ఇప్పటివరకు 25 మంది మృతదేహాలను వెలికితీశాము. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించాం’ అని ఉగాండా పోలీసు శాఖ ప్రతినిధి ఫ్రెడ్ ఎనాంగే వెల్లడించారు. దాడి అనంతరం తిరుగుబాటుదారులు కాంగో దేశంలోని విరుంగా జాతీయ పార్కు దిశగా పారిపోయినట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని విధాలుగా కృషిచేస్తున్నట్టు చెప్పారు.
తూర్పు ఉగాండాలో 1990వ దశకంలో ఈ ఏడీఎఫ్ పుట్టుకొచ్చింది. 1986 నుంచి అక్కడ అధికారంలో ఉన్న ఉగాండా అధ్యక్షుడు యోవెరీ ముసెవెని పాలనను ఏడీఎఫ్ వ్యతిరేకిస్తోంది. 2001లో ఉగాండా సైన్యం చేతిలో ఓటమి తర్వాత.. డీఆర్సీలోని నార్త్ కివు రాష్ట్రంలో రీలొకేట్ అయ్యింది. అక్కడి నుంచి గత రెండు దశాబ్దాలుగా ఈ ఏడీఎఫ్ సభ్యులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరికి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తోనూ సంబంధాలు ఉన్నాయి. 2021లో ఉగాండా రాజధాని కంపాలాలో జరిగిన భీకర బాంబు దాడి ఈ ఏడీఎఫ్ పనేనని ఆరోపణలు ఉన్నాయి.
Also Read..
Adipurush | దేశ ప్రజలకు ఆదిపురుష్ టీం క్షమాపణలు చెప్పాలి : శివసేన ఎంపీ
Manipur Violence | మణిపూర్ ను ఎవరూ రాష్ట్రంగా గుర్తించట్లేదు.. ఆర్మీ విశ్రాంత అధికారుల ఆవేదన
Donald Trump | రెస్టారెంట్ లో బిల్లు కట్టకుండా జారుకున్న ట్రంప్.. నెట్టింట ట్రోల్స్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

