fire at restaurant | చైనా (China)లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ రెస్టారెంట్లో (restaurant) అగ్నిప్రమాదం చోటు చేసుకుంది (fire at restaurant). ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
లియాయాంగ్ (Liaoyang) నగరంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సుమారు ముగ్గురు గాయపడ్డట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రెండు, మూడు అంతస్తుల బిల్డింగ్ కిటికీల నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రంగంలోకి దిగిన అధికారులు మంటలను ఆర్పివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Mehul Choksi | ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీకి బెల్జియం కోర్టులో ఎదురుదెబ్బ..!
X account withheld | భారత్లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
Canada PM | ట్రంప్ బెదిరింపులకు భయపడొద్దు.. మనం ఐక్యంగా ఉండాలి : మార్క్ కార్నీ