Mehul Choksi | ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీకి బెల్జియం కోర్టులో ఎదురుదెబ్బ..!
Mehul Choksi | కుట్ర, మోసం, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) కి బెల్జియం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లో బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన మెహుల్ ఛోక్సీ.. తప్పుడు పత్రాలు సమర్పించి బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడు.
Mehul Choksi : కుట్ర, మోసం, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) కి బెల్జియం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లో బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన మెహుల్ ఛోక్సీ.. తప్పుడు పత్రాలు సమర్పించి బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడు. దాంతో బెల్జియం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఛోక్సీ తన అరెస్టును కోర్టులో సవాల్ చేశాడు.
అయితే బెల్జియం కోర్టులో ఛోక్సీకి ఎదురుదెబ్బ తగిలింది. ఛోక్సీ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగ్గా కోర్టు కేసును వాయిదా వేసింది. తదుపరి విచారణ ఎప్పుడు అనేది వెల్లడించలేదు. దాంతో కోర్టు తదుపరి విచారణ జరిపే వరకు ఛోక్సీ జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఛోక్సీ తన పిటిషన్లో బెల్జియం అధికారులపై పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తన అరెస్టుకు సంబంధించి అధికారులు సరైన చట్ట విధానాలను అనుసరించలేదని, తన ప్రాథమిక హక్కులకు సైతం భంగం కలిగించారని ఆరోపించాడని అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి.
అంతేగాక ఛోక్సీ గతవారం బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ విషయాన్ని ఛోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించారు. ఛోక్సీ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని, ప్రస్తుతం క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేశారని మెహుల్ ఛోక్సీపై, అతని మేనల్లుడు నీరవ్ మోదీపై 2018లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
దాంతో ఆ ఇద్దరూ దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు వెళ్లగా.. నీరవ్‌మోదీ లండన్‌లో ఆశ్రయం పొందాడు. ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని గత నెల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి ఛోక్సీ సాయంతో 2023 నవంబర్‌లో అతడు ‘ఎఫ్ రెసిడెన్సీ కార్డ్’ పొందాడు. అందుకు అతడు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు.
మరోవైపు ఛోక్సీకి భారత్‌లో, అంటిగ్వాలో పౌరసత్వాలు ఉన్నాయి. బెల్జియం పౌరసత్వం తీసుకున్నప్పుడు ఛోక్సీ ఈ విషయాన్ని దాచి పెట్టాడు. ఈ కారణాలతోనే అక్కడి అధికారులు ఛోక్సీని అరెస్టు చేశారు. ఇదిలావుంటే దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన ఛోక్సీని భారత్‌కు రప్పించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

