శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 14, 2020 , 12:40:46

స్వైన్ఫ్లూ కంటే కోవిడ్-19 పదిరెట్లు ప్రమాదకరం

స్వైన్ఫ్లూ కంటే కోవిడ్-19 పదిరెట్లు ప్రమాదకరం

స్వైన్‌ఫ్లూ వైరస్‌కన్నా కోవిడ్‌-19 వైరస్‌ పదిరెట్లు ప్రమాదకరమైనదని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. కరోనా కేసులు తగ్గినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని, ఆంక్షలను ఎత్తేయటంలో నిదానం పాటించాలని సూచించింది. 2009లో స్వైన్‌ఫ్లూ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ‘కోవిడ్‌-19 వేగంగా వ్యాపిస్తుంది. అత్యంత ప్రమాదకరమైనది’ అని ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనమ్‌ గెబ్రియేసుస్‌ అన్నారు. ఈ వ్యాధిని పూర్తిగా నిరోధించాలంటే అత్యంత సురక్షితమైన వ్యాక్సిన్‌ అవసరమని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1140000 మందికిపైగా మరణించారు. ప్రపంచమంతా ఒకదేశానికి ఒకటి అనేక మార్గాల ద్వారా అనుసంధానమై ఉంటుంది కాబట్టి ఇప్పుడు తగ్గినా ఈ వ్యాధి మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.  


logo