China | చైనాలో కుప్పకూలిన బంగారు గని.. చిక్కుకున్న 18మంది కార్మికులు
చిక్కుకున్న 40 మంది కార్మికులలో 22 మంది సురక్షితం
China : క్రిస్మస్కు ముందు రోజు చైనాలో బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలింది. 18మంది కార్మికులు గనిలో చిక్కుకుపోయారు. వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గ్జిన్జియాంగ్లోని ఇనింగ్ కౌంటీలో ఉన్న బొగ్గు గని శనివారం మధ్యాహ్నం కూలిపోయింది. ఆ సమయంలో 40 మంది కార్మికులు గనిలో ఉన్నారు. వీళ్లలో 22 మందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి అని గ్జిన్హు వార్తా సంస్థ శనివారం రాత్రి తెలిపింది. ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు. ఈ బంగారు గని కజకిస్థాన్ సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కింజాయ్ ప్రాంతంలో సెప్టెంబర్లో బొగ్గు గని కూలిన ప్రమాదంలో 19 మంది చనిపోయారు. పోయిన ఏడాది డిసెంబర్లో షాంక్సీ రాష్ట్రంలో బొగ్గు గని కూలిన సంఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు విడిచారు. ప్రపంచంలో ఎక్కువ మైనింగ్ పరిశ్రమలు ఉన్నది చైనాలోనే. పోయిన ఏడాది 370 లక్షల టన్నుల బంగారాన్ని చైనా వెలికితీసింది. అంతేకాదు బొగ్గు ఉత్పత్తిలోనూ ఆ దేశం మొదటిస్థానంలో ఉంది. అయితే.. అక్కడ గనులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. గనుల్లోకి వెళ్లే కార్మికులకు సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ప్రతిసారి కొందరు మృత్యువాత పడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Gold mine
- Kazakhstan
- n
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

