సుబేదారి, జూలై 31: సోషల్ మీడియా ద్వారా మహిళలను పరిచయం చేసుకొని, లోబరుచుకొని లైంగిక దాడికి పాల్పడిన సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్టు సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై శ్రీకాంత్ సోషల్ మీడియాలో పలువురు మహిళల ప్రొఫైల్స్ వెతికి, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతూ, పరిచయం చేసుకొని లోబరుచుకొని లైంగిక దాడులకు పాల్పడేవాడు.
ఈక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకొంటానని నమ్మించి లైంగిక దాడిని పాల్పడగా, అతడిపై జగిత్యాల పీఎస్‌లో కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలతో నిందితుడు ఎస్సై శ్రీకాంత్ నిజామాబాద్‌లో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేసి, హనుమకొండకు తరలించినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.