Bus Skids Off Cliff | శ్రీలంక (Sri Lanka)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బౌద్ధ యాత్రికులతో (Buddhist pilgrims) వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో పది మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
బస్సు 70 మంది బౌద్ధ యాత్రికులతో కోట్మలేలోని కొండ ప్రాంతం గుండా ప్రయాణిస్తోంది. అయితే, తెల్లవారుజామున సమయంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 30 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సు సామర్థ్యం కంటే అధిక సంఖ్యలో యాత్రికులు (Overcrowded Bus) ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Indian Air Force | ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది.. వదంతులు నమ్మొద్దు : ఇండియన్ ఎయిర్ ఫోర్స్
Rajnath Singh | లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం.. ప్రారంభించనున్న రక్షణ మంత్రి రాజ్నాథ్