Bangladesh | కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా.. బంగ్లాదేశ్లో 15 మంది మృతి.. 10 మందికి గాయాలు
Bangladesh : బంగ్లాదేశ్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఒక ట్రక్కు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది మరణించారు. మరో పది మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది.
Bangladesh : బంగ్లాదేశ్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఒక ట్రక్కు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది మరణించారు. మరో పది మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వాయువ్య దిశలో తంగైల్ జిల్లా, సొరాటాయిల్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో జరిగింది.
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొందరు కూలీలు ఢాకా నుంచి బక్రీద్ వేడుకల కోసం తమ ఊళ్లకు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లకు బయల్దేరారు. ఈ క్రమంలో అక్కడి హైవేపై ట్రక్కును ఆపి అందులో ఎక్కారు. ఇలా పలువురు ప్రయాణికులతో వెళ్తుండగా, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా, అతివేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది ప్రయాణికులు మరణించారు. మరో పది మందికిపైగా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రక్షక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్ని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
బంగ్లాదేశ్లో కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా వేలాది మంది అక్కడ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బంగ్లాలో ట్రాఫిక్ రూల్స్ పెద్దగా అమలు కావు. ట్రాఫిక్ వ్యవస్థ కూడా సరిగ్గా పని చేయదు. అలాగే, రోడ్లు బాగోలేకపోవడం, నైపుణ్యం లేని డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అక్కడి నివేదికలు తెలుపుతున్నాయి.
,
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- bangladesh
- Dhaka
- Labourers
- Truck
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

