జకార్తా: వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు, మద్యం సేవించినందుకు ఒక జంటకు ఇండోనేషియాలోని అసెహ్ ప్రావిన్స్‌లో బహిరంగంగా 140 కొరడా దెబ్బల శిక్షను అమలు చేశారు. మరో నలుగురికి కూడా ఇదే శిక్ష గురువారం అమలైంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేషియాలో అసెహ్ ప్రావిన్స్‌లో మాత్రమే షరియా చట్టం అమలవుతున్నది. ఈ చట్టం ప్రకారమే ఈ శిక్షను విధించారు. ఈ శిక్ష అమలు సందర్భంగా బాధితురాలు దెబ్బలకు తాళలేక ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది.
మరోవైపు ఇదే ప్రావిన్స్‌లో పోలీస్ శాఖలోని ఒక ఉద్యోగి తన సహచరురాలితో ప్రైవేట్ స్థలంలో సన్నిహితంగా కనిపించడం ఖల్వత్ నిబంధనలకు విరుద్ధమని న్యాయ నిర్ణేతలు తేల్చారు. పెండ్లికి ముందే వారిలా సన్నిహితంగా ఉన్నందుకు వారిద్దరిని 23 కొరడా దెబ్బలు కొట్టారు.