Earthquakes | పొరుగు దేశం అఫ్ఘానిస్థాన్ (Afghanistan) వరుస భూకంపాలతో (Earthquakes) దద్దరిల్లింది. శనివారం మధ్యాహ్నం అరగంట వ్యవధిలో ఏకంగా మూడు భారీ భూకంపాలు (Three powerful earthquakes ) సంభవించాయి. రిక్టరు స్కేలుపై 6.1, 5.9, 6.2 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (National Center for Seismology) వెల్లడించింది. ఈ భూప్రకంపనల ధాటికి పలు చోట్ల భవనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 78 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కాగా, ముందుగా శనివారం మధ్యాహ్నం 12:11 గంటలకు తొలి భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైంది. తుర్క్మెనిస్థాన్లోని అస్గాబట్ నగరానికి ఆగ్నేయంగా 471 కిలో మీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
ఆ తర్వాత 8 నిమిషాలకే అంటే 12:19 నిమిషాలకు మరోసారి భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ఆ తర్వాత 23 నిమిషాల వ్యవధి తర్వాత అంటే 12:42 గంటలకు మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. అస్గాబట్ నగరానికి ఆగ్నేయంగా 428 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 34 కిలోమీటర్ల లోతుతో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Mosquitoes | డెంగ్యూ భయం.. దోమలను ఆసుపత్రికి తీసుకెళ్లిన వ్యక్తి
Cobra | హెల్మెట్లో దూరిన పాము పిల్ల.. ఎలా బయటకు తీశారో చూడండి.. VIDEO
Amitabh Bachchan | జయా బచ్చన్ చాలా స్ట్రిక్ట్.. తనంటే నాకు భయం : అమితాబ్ బచ్చన్