Cobra | పాము కాటు నుంచి ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. కేరళ (Kerala)లోని త్రిస్సూర్ (Thrissur)కు చెందిన ఓ వ్యక్తి హెల్మెట్ (Helmet)లోకి పాము పిల్ల దూరింది. ముందుగానే అది గమనించడంతో ఆ వ్యక్తి ప్రాణాలను దక్కించుకోగలిగాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. త్రిస్సూర్‌కు చెందిన సోజన్ అనే వ్యక్తి తాను పనిచేసే చోట బండి పార్క్ చేసి ఉంచాడు. హెల్మెట్‌ను బైక్ ముందు భాగంలో ఉంచి వెళ్లాడు. అనంతరం పని ముగించుకొని సాయంత్రం బైక్ తీయబోయాడు. అయితే, అక్కడ హెల్మెట్‌ను పట్టుకోగా అందులో ఏదో కదులుతున్నట్లు అతడికి అనిపించింది. దీంతో అనుమానం వచ్చి చూడగా.. చిన్న కోబ్రా (Cobra) పిల్ల అందులో కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సోజన్.. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న లిజో అనే వ్యక్తి ఆ కోబ్రాను ఎంతో చాకచక్యంగా హెల్మెట్ నుంచి బయటకు తీశాడు. అనంతరం దాన్ని ఓ కవర్లో ఉంచి అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
हेलमेट में निकला कोबरा, किस्मत से बची युवक की जान
◆ केरल के त्रिस्सूर की है घटना
◆ पार्किंग में बाइक खड़ी करके काम से गया था युवक #Thrissur #ViralVideo #SnakeInHelmet | Snake in Helmet pic.twitter.com/4rY7VzHWQV
— News24 (@news24tvchannel) October 6, 2023
Also Read..
Amitabh Bachchan | జయా బచ్చన్ చాలా స్ట్రిక్ట్.. తనంటే నాకు భయం : అమితాబ్ బచ్చన్
Bus Accident | ఘోర బస్సు ప్రమాదం.. 17 మంది మృతి
Indian-Origin Couple | అమెరికాలో విషాదం.. అనుమానాస్పదంగా భారత సంతతి కుటుంబం మృతి