Amitabh Bachchan | జయా బచ్చన్ చాలా స్ట్రిక్ట్.. తనంటే నాకు భయం : అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan | తన భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయా బచ్చన్ అంటే తనకు చాలా భయమని చెప్పారు.
Amitabh Bachchan | తన భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయా బచ్చన్ అంటే తనకు చాలా భయమని చెప్పారు. బిగ్‌బీ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ (Kaun Banega Crorepati) టాక్ షోకు ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ద్వారా అమితాబ్ తన వ్యక్తిగత విషయాలను కూడా అప్పుడప్పుడూ షేర్ చేసుకుంటున్నారు. ఈ టాక్ షోలో ఇప్పటివరకు వచ్చిన 14 సీజన్లు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు 15వ సీజన్ నడుస్తోంది.
తాజా సీజన్లో 40వ ఎపిసోడ్లో చత్తీస్‌గఢ్‌కు చెందిన జయా పటేల్ (Jaya Patel) అనే మహిళ పాల్గొంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌ను ‘మీరు ఓ టీచర్ అయితే ఎలా ఉంటారు..? స్ట్రిక్ట్గానా.. లేక సరదాగా ఉంటారా..?’ అని అమితాబ్ ప్రశ్నించారు. దానికి ఆమె ‘సార్, నేను టీచింగ్ చేసేటప్పుడు కఠినంగానే వ్యవహరిస్తాను. మిగతా సమయాల్లో సాధారణంగా కూల్‌గానే ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం కంటెస్టెంట్ జయా పటేల్.. బిగ్‌బీని కూడా జయా బచ్చన్ గురించి ప్రశ్నించింది.
దీనికి బిగ్‌బీ సమాధానమిస్తూ.. ‘ఆమె (జయా బచ్చన్) నా పట్ల చాలా స్ట్రిక్ట్‌గానే ఉంటుంది. అయినా ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు. ఆమెతో కలిసి ఈ షో చూసేటప్పుడు నాకు ఉంటుంది. ఆ సీన్ తలచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. అందుకే వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా బయటకు చెప్పను’ అంటూ అమితాబ్ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బిగ్‌బీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Indian-Origin Couple | అమెరికాలో విషాదం.. అనుమానాస్పదంగా భారత సంతతి కుటుంబం మృతి
Air India | ఎయిర్ ఇండియా విమానాల కొత్త లుక్.. ఫొటోలు వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

