Bus Crash | సౌత్ ఆఫ్రికా (South Africa)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జోహనస్బర్గ్లో హైవేపై బస్సు బోల్తాపడింది (Bus Crash). ఈ ఘటనలో 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. అనేకమంది గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. జోహనస్‌బర్గ్ (Johannesburg)లోని ప్రధాన ఓఆర్ టాంబో అంతర్జాతీయ విమానాశ్రయం (OR Tambo International Airport) సమీపంలోని హైవేపై మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జోహనస్బర్గ్కు తూర్పున ఉన్న టౌన్షిప్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు కాగా, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. సుమారు 45 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read..
Ukrainian Drones: 337 ఉక్రెయిన్ డోన్లను కూల్చివేశాం: రష్యా రక్షణ శాఖ
Donald Trump | అమెరికాలో బాయ్‌కాట్ టెస్లా నినాదం.. మస్క్‌కు మద్దతుగా ట్రంప్ కీలక ప్రకటన
Dog Cloning: చనిపోయిన కుక్క జన్యువులతో క్లోనింగ్.. 19 లక్షలు ఖర్చు పెట్టిన చైనీస్ మహిళ