China | చైనాలో భారీ భూకంపం.. 116 మంది మృతి
భారీ భూకంపంతో చైనా (China) వణికిపోయింది. భూకంప తీవ్రతతో వాయవ్య చైనాలో పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో 111 మంది మరణించారు. 230 మందికిపైగా గాయపడ్డారు.
బీజింగ్: భారీ భూకంపంతో చైనా (China) వణికిపోయింది. భూకంప తీవ్రతతో వాయవ్య చైనాలో పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో 116 మంది మరణించారు. 400 మందికిపైగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాయవ్య చైనాలోని గన్సు (Gansu), కింగ్హై (Qinghai) ప్రావిన్సులలో భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీనితీవ్రత 6.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని, గన్సు ప్రావిన్సులోని లాన్జ్హౌకు (Lanzhou) 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చైనీస్ మీడియా తెలిపింది.
అర్ధరాత్రివేళ భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో భారీ నష్టం సంభవించింది. మంగళవారం తెల్లవారుజున అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. నేలకూలిన భవనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు స్థానిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Earthquake of Magnitude:6.1, Occurred on 18-12-2023, 21:29:31 IST, Lat: 35.74 & Long: 102.69, Depth: 10 Km ,Location: 805km NNW of Chongqing, China for more information Download the BhooKamp App https://t.co/SZkLePGOLo @Dr_Mishra1966 @moesgoi @KirenRijiju @Indiametdept pic.twitter.com/cQxyQSNuMI
— National Center for Seismology (@NCS_Earthquake) December 18, 2023




Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Earthquake
- Gansu
- Lanzhou
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

