Donald Trump: ఇరాన్‌పై 1000 మిస్సైళ్లు ఎక్కుపెట్టాం.. బెదిరింపులకు కౌంటర్‌గా ట్రంప్ వార్నింగ్
Donald Trump: ఖమేనీ అంత్యక్రియల్లో కిల్ ట్రంప్ అంటూ ఇరానియన్లు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఆ బెదిరింపులకు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్‌ను ధ్వంసం చేసేందుకు ఆ దేశంపై 1000 మిస్సైళ్లు లాక్ చేసి, లోడ్ చేసి ఉంచామన్నారు.
దుబాయ్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇవాళ తన ట్రుత్ సోషల్‌లో మరోసారి ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ట్రంప్‌ను హతమార్చాలంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కిల్ ట్రంప్ అంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. అయితే ఆ బెదిరింపులకు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్‌ను ధ్వంసం చేసేందుకు ఆ దేశంపై 1000 మిస్సైళ్లు లాక్ చేసి, లోడ్ చేసి ఉంచామన్నారు. ఆ తర్వాత ఇంకా వేలాది సంఖ్యలో ఇరాన్‌ను సర్వనాశనం చేసేందుకు క్షిపణులు రెఢీగా ఉన్నట్లు ఆయన తన వార్నింగ్‌లో పేర్కొన్నారు. అమెరికా మిలిటరీ ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేసి బూడిది చేస్తుందన్నారు. హోర్ముజ్ జలసంధిని తెరిచే ఉంచే విషయంలో ఇరాన్ బహిరంగ ప్రకటన చేయాలని ట్రంప్ తన పోస్టులో తెలిపారు. హోర్ముజ్ మార్గంలో వెళ్తున్న నౌకలపై దాడి చేయబోమని ఇరాన్ కట్టుబడి ఉండాలన్నారు. తాజాగా మూడు నౌకలపై ఇరాన్ దాడి చేయడం వల్లే.. ఆ దేశంపై మళ్లీ అటాక్ జరిగినట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

