న్యూఢిల్లీ: అమెరికా సైనిక హెచ్చరికలు పెరుగుతున్న నేపథ్యంలో తన రక్షణ సామర్థ్యం గురించి ఇరాన్ గట్టిగా బదులిచ్చింది. భూ ఉపరితలం, సముద్రంపై నుంచి ప్రయోగించగల వెయ్యి డ్రోన్లను సిద్ధం చేసినట్లు ఇరాన్ సైన్యం శుక్రవారం ప్రకటించింది. అమెరికా యుద్ధనౌకలు ఇరాన్ వైపు పయనిస్తున్నాయని, ఇరాన్‌పై కఠిన చర్యలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన దరిమిలా ఇరాన్ సైన్యం ఈ వ్యాఖ్యలు చేసింది.
తమపై అమెరికా దాడి ప్రారంభిస్తే తమ దేశాన్ని కాపాడుకోవడంలో డ్రోన్లు, క్షిపణులతో కూడిన ఈ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందని సైనికాధికారులు తెలిపారు.