తెహ్రాన్ : ఇరాన్‌లోని తాబాస్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రైలు బుధవారం ఉదయం 5:30 గంటలకు పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో 10 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో 350 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై తబాస్ గవర్నర్ అలీ అక్బర్ రహిమీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 12 అంబులెన్స్‌లు, ఒక హెలికాప్టర్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.