జొహన్నెస్‌బర్గ్ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిసంస్కరణలు ఇక ఎంత మాత్రం ఓ ఎంపిక కాదని, అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. అంతర్జాతీయ పాలనా వ్యవస్థలకు ఈ సందేశాన్ని భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా త్రయం పంపించాలన్నారు.
భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా(ఇబ్సా) నేతల సదస్సులో ఆయన ఆదివారం ఈ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ (ఏఐ) దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ప్రపంచం సామూహికంగా ఓ అంగీకారానికి రావాలన్నారు. ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం మానవుని కేంద్రంగా ఉండాలని, ఆర్థిక కేంద్రంగా ఉండకూడదని హెచ్చరించారు.
న్యూఢిల్లీ : తాము సరఫరా చేసిన రాఫెల్ విమానాలపై పాక్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని ఫ్రెంచ్ నేవీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ విమానాలు కూల్చారన్నది అవాస్తవమని పేర్కొంది.